నువ్వా నువ్వా నువ్వే చెప్పు
నిన్నే దాటి వచ్చేశావా నన్నే కలవగా
ప్రాణం వీడి పయనించావా ప్రాణం నిలపగా
జారుకుంది ఆడ చేరుకుంది ఈడ జాలమా జాలమా
అరే జరిగిందంతా కలా జరుగుతోంది కలా కాలమా తెలుపుమా
ప్రేమే జాబిలై చేయ్యందించెనే
నా ఆకాశం రెండయ్యి కనిపించేలే
నువ్వా నువ్వా నువ్వే చెప్పు నువ్వే నువ్వా
పువ్వా నువ్వా తారల్లోని తారజువ్వా
నువ్వా నువ్వా నువ్వే చెప్పు నువ్వే నువ్వా
పువ్వా నువ్వా తారల్లోని తారజువ్వా
మంచు నయనాలు పంచే కథనాలు పంచ ప్రాణాలు పిండేస్తుంటే
ఇది నిజమేనా మరి నిదరేనా అనుమానాలు పుడుతూ ఉంటే
రంగు వెలిశాక రేకు విచ్చుకుందే చైత్రం చిత్రమా
కళ్ళు తెరిచాక కల విచ్చేసిందే సత్యం శూన్యమా
గుండెలోన కాగే కంటి నీరు తాగి ప్రేమ జీవించునా
నే నింగిలోనా నేనే నేలపైనా నేనే నడుమ వేలాడినా
నిన్నే దాటి వచ్చేశావా నన్నే కలవగా
ప్రాణం వీడి పయనించావా ప్రాణం నిలపగా
ఇది కొత్త లోకం అది కొత్త ఆకాశం ఆడ చంద్రుళ్లు రెండున్నాయే
వారు వీరేనా వేరు వేరేనా అణు ప్రశ్నల్లో నేనున్నానే
దేహం కాలిపోయినా ప్రాణం రాలిపోయినా ఆత్మే మారునా
ఈ బంధమేమిటో ఇంత సందడేమిటో ఇది తనకే తెలుసునా
ప్రేమే నిజమే అయితే జగమే మారును అంతే ప్రేమయే దైవమా
ఓ ప్రేమే నిజమే అయితే జగమే మారును అంతే ప్రేమయే దైవమా
నువ్వా నువ్వా నువ్వే చెప్పు నువ్వే నువ్వా
పువ్వా రువ్వా తారల్లోని తారజువ్వా
నిన్నే దాటి వచ్చేశావా నన్నే కలవగా
ప్రాణం వీడి పయనించావా ప్రాణం నిలపగా
జారుకుంది ఆడ చేరుకుంది ఈడ జాలమా జాలమా
అరే జరిగిందంతా కలా జరుగుతోంది కలా కాలమా తెలుపుమా
ప్రేమే జాబిలై చేయ్యందించెనే
నా ఆకాశం రెండయ్యి కనిపించేలే