ఈ సాయంత్ర వేళ నీ ఏకాంత సేవ అతి మధురం అనురాగం ఒదిగే వయ్యారం
ఈ సింధూర వేళ నీ శృంగార లీల సుఖ శిఖరం శుభయోగం అది నా సంగీతం
ఎంతకు తీరని ఎదలో ఆశలేమో అడగరానిదై చెప్పరానిదై పెదవుల అంటింతనై
మాటతో తీరని మదిలో దాహమే చిలిపి ముద్దుకై చినుకు తేనెకై కసికసి కవ్వింతలై
నీ నవ్వు నాలో నాట్యాలు చేసే కౌగిట్లో సోకమ్మ వాకిట్లో తెరిచే గుప్పిళ్లలోన
చూపుతో గిచ్చక వయసే లేతదమ్మా వలపు గాలికే వాడుతున్నది విసరకు పూబాణమే
చేసుకో మచ్చిక వరసే కొత్తదమ్మా చలికి రేగిన ఒడికి చేరిన చెరిసగ మీ ప్రాణమే
నీ ఊపిరి నాలో పూలారబోసి అందాలో నా ప్రేమ గంధాలో ముసిరే ముంగిళ్లలోన
ఈ సాయంత్ర వేళ నీ ఏకాంత సేవ
సుఖ శిఖరం శుభయోగం అది నా సంగీతం