కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ (ఓ సందమామ)
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ (ఓ సందమామ)
పొగరాని కుంపట్లు రగిలించినాదే
పొగరెక్కి చలిగాణ్ణి తగలేసినాడే
మంచమల్లె మారిపోయె మంచు కొండలు
మంచిరోజు మార్చమంది మల్లె దండలు
కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ (ఓ సందమామ)
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ (ఓ సందమామ)
తేనీటి వాగుల్లో తెడ్డేసుకో పూలారబోసేటి ఒడ్డందుకో
శృంగార వీధుల్లో చిందేసుకో మందార బుగ్గల్ని చిదిమేసుకో
సూరీడుతో ఈడు చలికాచుకో పొద్దారిపోయాక పొద చేరుకో
గుండెలోనే పాగా గుట్టుగా వేశాక గుట్టమైన సోకు నీదే కదా
ఇచ్చుకోక ముందే ముట్టె తాంబూలము
పెళ్ళి కాక ముందే జరిగె పేరంటము
కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ (ఓ సందమామ)
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ (ఓ సందమామ)
సింధూర రాగాలు చిత్రించుకో అందాల గంధాల హాయందుకో
పన్నీటి తానాలు ఆడేసుకో పరువాలు నా కంట ఆరేసుకో
కాశ్మీరు చిలకమ్మ కసి చూసుకో చిలక పచ్చ రైక బిగి చూసుకో
గూటి పడవల్లోన చాటుగా కలిశాక నీటికైనా వేడి పుట్టాలిలే
పూత మొగ్గ లేత బుగ్గ సొట్టబడ్డ చోట పెట్టు నీ ముద్దులు
హేయ్ సొంతమైన చోట లేవు ఏ హద్దులు
అరె కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ (ఓ సందమామ)
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ (ఓ సందమామ)
పొగరాని కుంపట్లు రగిలించినాదే
పొగరెక్కి చలిగాణ్ణి తగలేసినాడే
చెమ్మాచెక్క (హా) చేత చిక్క (హా)
మంచమల్లె మారిపోయె మంచు కొండలు
మంచిరోజు మార్చమంది మల్లె దండలు