LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Donga Mogudu

•

1986

Kokamma Cheppamma

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
కోకమ్మా చెప్పమ్మా చెలి సోకు ఏపాటిదో
వద్దమ్మా తప్పమ్మా తెలిశాక విలువేమిటో
నీ పొంగు చూసి మెచ్చి వచ్చానే
ఇచ్చే రోజే వస్తే అన్నీ ఇస్తాలే
ఊరించుతూ నన్ను వేధించడం న్యాయమా
కోకమ్మా చెప్పమ్మా చెలి సోకు ఏపాటిదో
వద్దమ్మా తప్పమ్మా తెలిశాక విలువేమిటో

కన్నెకుసుమం కన్ను గీటి నన్ను పిలిచిన వేళ
తేనె వానల తాన మాడగ తేటినై నే రానా లలాలలలా
కాటు వేసిన మోటు సరసం హాయి గురుతై పోగా
ఘుమ్ముఘుమ్ముగా కమ్ముకున్నా మత్తు వరదై రాదా
ఓహో ఓ ఓ ఓ ఓ మారం చేసే ఆరేళ్లన్నీ తీరాలి ఈ వేళలో
ఓహో ఓ ఓ ఓ ఓ పందెం వేసే అందాలన్నీ ఊగాలి ఉయ్యాలలో
కోకమ్మా చెప్పమ్మా చెలి సోకు ఏపాటిదో
వద్దమ్మా తప్పమ్మా తెలిశాక విలువేమిటో

వలపు వానా కురిసినాక వయసు వరదై పోదా
కోరికలతో ఏరువాక సాగు తరుణం రాదా లలాలలలా
కన్న కలలు కోతకొచ్చే పుష్యమాసం రాదా
శోభనాల సంకురాతిరి సంబరాలే కాదా
తూనిగల్లే ఆనందాలే తేలాలి ఈ గాలిలో
తేనీగల్లే మకరందాలే తూలాలి ఈ పూలలో
కోకమ్మా చెప్పమ్మా చెలి సోకు ఏపాటిదో
వద్దమ్మా తప్పమ్మా తెలిశాక విలువేమిటో
నీ పొంగు చూసి మెచ్చి వచ్చానే
ఇచ్చే రోజే వస్తే అన్నీ ఇస్తాలే
ఊరించుతూ నన్ను వేధించడం న్యాయమా

WRITERS

Sirivennela

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Donga Mogudu

1986

01

Nallanchu Tella Cheera

K. Chakravarthy, P. Susheela, S. P. Balasubrahmanyam, Sirivennela Sitaramasastri

02

Ee Chempaku Selaveeyaku

K. Chakravarthy, P. Susheela, S. P. Balasubrahmanyam, Sirivennela Sitaramasastri

03

Kokamma Cheppamma

K. Chakravarthy, S. Janaki, S. P. Balasubrahmanyam, Sirivennela Sitaramasastri

04

Idly Papa Idly Papa

K. Chakravarthy

05

Nee Kokakintha

K. Chakravarthy

06

Addama Reyi

K. Chakravarthy