(తననం) రేపల్లె మళ్ళీ మురళి విన్నది
(తననం)ఆ పల్లె కళే పలుకుతున్నది
(తననం) ఆ జానపదం ఘల్లు మన్నది
(తననం)ఆ జాణ జతై అల్లుకున్నది
మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక
ఎదను పరిచి వేసెయ్యనా ప్రణయ వేదిక
మల్లెపువ్వు మా రాణి ఈ గొల్ల గోపిక
మూగ మనసు వింటున్నది మురళిగీతిక
(తననం) రేపల్లె మళ్ళీ మురళి విన్నది
(తననం)ఆ పల్లె కళే పలుకుతున్నది
తాననతందానన తజుమ్ తజుమ్ తజుమ్ తజుమ్
తాననతందానన తజుమ్ తజుమ్ (తజుమ్ తజుమ్)
ఆ పెంకితనాల పచ్చిగాలి ఇదేనా పొద్దుపోని ఆ ఈల ఈ గాలి ఆలాపన
ఆ కరుకుతనాల కన్నె మబ్బు ఇదేనా ఇంతలో చిన్నారి చినుకై చెలిమే చిలికేనా
అల్లరులన్ని పిల్లనగ్రోవికి స్వరములిచ్చేనా
కళ్ళెర్ర జేసి కిన్నెరసానికి సరళి నచ్చేనా
మెత్తదనం (తందానన) మెచ్చుకుని గోపాలకృష్ణయ్య గారాలు చెల్లించనా
(తననం) రేపల్లె మళ్ళీ మురళి విన్నది
(తననం)ఆ పల్లె కళే పలుకుతున్నది
మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక
మూగ మనసు వింటున్నది మురళిగీతిక
నీ గుండె వినేలా వెంట వెంట ఉండేలా గొంతులోని రాగాలు పంపాను ఈ గాలితో
ఆ ప్రేమ పదాల గాలిపాట స్వరాలు పోల్చుకుని కలిపేస్తున్నాను నా శ్వాసలో
ఎక్కడున్నా ఇక్కడ చిన్న వెన్నె వెణువయ్యె
కొంగును లాగే కొంటేదనాలే కనులకు వేలుగయ్యే
వన్నెలలో (తందనానా) వెన్నెలలో వెచ్చనయ్యే వెల్లువలయ్యె వరసే ఇది
రేపల్లె మళ్ళీ మురళి విన్నది
మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక
ఎదను పరిచి వేసెయ్యనా ప్రణయ వేదిక
మల్లెపువ్వు మా రాణి ఈ గొల్ల గోపిక
మూగ మనసు వింటున్నది మురళిగీతిక