మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా
మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా
దివిలో తారాజువ్వా జువ్వా జువ్వా
మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా
సిరిసిరి మువ్వలా చిరుసడి వింటే
సిరిసిరి మువ్వలా చిరుసడి వింటే
పొంగే పారే ఏటిలో తొంగి తొంగి చూస్తే
సోకేటి పవనం నువ్వు మురిపించే కథనం
కలత నిదురలో కలలాగ జారిపోకే జవరాలా
హృదయ లోగిలిలో నువ్వా నువ్వా నువ్వా
మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా
తీయనైన ఊసుతో ప్రియ విరహముతో
తీయనైన ఊసుతో ప్రియ విరహముతో
సాగిపోయే దారిలో వేసే ప్రతి అడుగులా
ఎగిసేటి కెరటం చేరేలే తీరం
చీకటిలో పయనం నువ్వేలే అరుణం
వలపు వరదలో నదిలాగ తడిపిపో జడివానలా
మంచు తెరలలో తడిలాగా నయన చిత్తడిలో