లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా మాయలేవి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా
లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నొ పంచుకున్న వేళలో మనదే సరదా సరదా
లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా
ఇంతలో ఇలా ఎదిగిన ఆ తలపులో ఎవరికై ఈ పిలుపులో
వింత వింతగా తిరిగిన ఈ మలుపులో తన జతే నువు కలుపుకో
ఇదంత చెప్పలేని ఈ భావనే పేరు ఉందో హో.. తెలియదు దానికైన ఈ వేళా
జవాబు చెప్పలేని ఈ ప్రశ్నలింకెన్ని ఎన్నో హో.. అవన్ని బయట పడవు ఇవ్వాళా
లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి స్పర్శ లాగ పైకి వచ్చి లేనిపోనివేవో రేపిందా
లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా మాయలేవి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా
మాటిమాటికీ మొదలయే ఈ అలికిడి మరుక్షణం ఓ అలజడి
ఆకతాయిగా తడిమితే ఈ తడబడి తరగదే ఈ సందడి
చలాకి కంటి పూల తావేదొ తాకిందిలాగా హా గులాబి లాంటి గుండె పూసేలా
ఇలాంటి గారడీల జోరింక చాలించదేలా హో ఎలాగ ఏమనాలి ఈ లీలా
లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి స్పర్శ లాగ పైకి వచ్చి లేని పోనివేవో రేపిందా